ఉచిత గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్

- August 04, 2024 , by Maagulf
ఉచిత గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్

హైదరాబాద్: కార్పొరేట్ వర్కింగ్ ఉమన్ మరియు వారి కుటుంబ సభ్యులకు షీ క్లీనిక్స్-(ప్రతి శనివారం ఉచిత గైనకాలజిస్ట్ కన్సల్టేషన్ మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్, 30% డిస్కౌంట్ ఆన్ అల్ ఇన్వెస్టిగేషన్స్ మరియు కాంప్లిమెంటరీ హెల్త్ చెక్ ప్యాకేజీ (సంవత్సరానికి ఒకసారి) ) ప్రారంభించిన మెడికవర్ ఉమన్ & చైల్డ్ హాస్పిటల్స్.

ముఖ్యతిధులుగా  గుల్నార్ విర్క్ కృష్ణ - హ్యాష్‌ట్యాగ్ మార్కెటింగ్ వ్యవస్థాపకురాలు,  Fitness & Wellness Enthusiast, ఇషా సిన్హా-Chief legal & Compliance Officer , పాల్గొని షి క్లీనిక్స్ ను  ప్రాంభించడం జరిగింది. 

అనంతరం ముఖ్యతిధులుగా గుల్నార్ విర్క్ కృష్ణ మాట్లాడుతూ వత్తిడి, సరైన లైఫ్‌స్టైల్ లేని కారణంగా ఇతర కారకాల ప్రభావాలతో ఆరోగ్య సమస్యలు వస్తాయి.వయస్సు, శారీరక వ్యాధులు,సమస్యలు మానసిక ఆరోగ్యం పై చెడు ప్రభావం చూపుతాయి.ఆరోగ్యకరమైన దినచర్యలో మార్పులు చేయడం, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి వ్యాయామం చేయడం ద్వారా మీరు లక్షణాలను కొంతవరకు తగ్గించవచ్చు.మహిళలు వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలి.మహిళలు ఆరోగ్యంగా ఉండటం మరియు ఆరోగ్యంగా ఉండాలనుకోవడం కూడా హక్కే అని అన్నారు. 

డాక్టర్స్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం విషయంలో ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలి.ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు మరియు వత్తిడి కారణంగా అన్ని వయస్సులవాళ్ళు  తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.ఈ ఆఫర్ పొందటానికి వచ్చేవారు వారి తప్పక  కంపెనీ ID కార్డు తీసుకొనిరాగలరు.

ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ అఫ్ బిసినెస్ ఆపరేషన్స్ మహేష్ దెగ్లూర్కర్, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే,సెంటర్ హెడ్  కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com