వాళ్లకు వణుకు పుట్టేలా వ్యవస్థలను బాగు చేస్తున్నాం: మంత్రి రవీంద్ర

- August 04, 2024 , by Maagulf
వాళ్లకు వణుకు పుట్టేలా వ్యవస్థలను బాగు చేస్తున్నాం: మంత్రి రవీంద్ర

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆలోచనా విధానంలో ఇంకా మార్పు రాలేదంటూ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకునే రోజులు వచ్చాయని చెప్పారు. అందుకే ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు.

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన విషయం, కార్లు తగలబెట్టిన ఘటన వాస్తవమని చెప్పారు. అక్కడ ఉన్న టీడీపీ నేతల్ని గాయపర్చారని అన్నారు. దాని మీద వైసీపీ నేతలు అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదనడం సిగ్గు చేటని చెప్పారు. పాపం చేసిన వారెవ్వరూ తప్పించుకోలేరని అన్నారు.

పేర్ని నాని చెబుతున్నవన్నీ నీతి కబుర్లేనని తెలిపారు. తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదని, వ్యవస్థలను మార్గంలో పెడుతున్నామని చెప్పారు. తప్పు చేసే వాళ్లకు వణుకు పుట్టేలా వ్యవస్థలను బాగు చేస్తున్నట్లు తెలిపారు.

పోలీస్ శాఖను ప్రక్షాళన చేస్తున్నామని అన్నారు. వైసీపీకి అంటకాగిన పోలీసులను ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పారు. ఎంత పెద్ద వాడైనా చట్టం ముందు తప్పించుకోలేరని తెలిపారు. ఎక్కడకు పారిపోయినా వెతికి తీసుకొస్తామని అన్నారు. అన్ని శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నట్లు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com