డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ విడుదల..
- August 04, 2024
హైదరాబాద్: హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపుదిద్దుకున్న డబుల్ ఇస్మార్ట్ సినిమా ట్రైలర్ ఇవాళ విడుదలైంది. ఈ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టడంతో డబుల్ ఇస్మార్ట్‌పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.
రామ్ పోతినేని యాటిట్యూడ్, కామెడీని ట్రైలర్ లో చూపించారు. అతడి మేనరిజం అదుర్స్ అనిపిస్తోంది.రామ్ పోతినేనిపై విలన్స్ ప్రయోగాలు చేస్తున్నట్లు ఇందులో చూపించారు. ‘ఇప్పుడు నా బ్రెయిన్.. నీ బ్రెయిన్‌లోకి వెళ్లబోతుంది’ అంటూ సంజయ్ దత్ డైలాగ్ చెప్పి ఆసక్తి రేకెత్తించాడు. చివరలో శివలింగం ముందు చేసిన ఫైటింగ్ సీన్ హైలైట్ గా కనపడుతోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా కావ్యా థపర్, విలన్‌గా సంజయ్ దత్ నటించాడు. ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా యూనిట్ విశాఖలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో పాల్గొంది. డబుల్ ఇస్మార్ట్ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు. చార్మితో కలిసి పూరి జగన్నాథ్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
తాజా వార్తలు
- శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ ఛైర్మన్
- తీరాన్ని తాకిన మొంథా తీవ్ర తుపాన్..
- విమానంలో ఫోర్క్‌తో దాడి–ఇండియన్ ప్యాసింజర్ అరెస్ట్!
- నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
- ISO ప్రమాణాలతో దోహా మెట్రోపాలిస్..!!
- విషాదం.. సౌదీలో నలుగురు విద్యార్థినులు మృతి..!!
- ఫుజైరాలో బ్యాంకు దొంగల ముఠా అరెస్టు..!!
- లైసెన్స్ లేని వైద్య సేవలు..ఉమెన్ సెలూన్ సీజ్..!!
- ఒమన్ లో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్, సౌదీ మధ్య ఆర్థిక సంబంధాలు బలోపేతం..!!







