ఖతార్ కు రికార్డు స్థాయిలో పోటెత్తిన పర్యాటకులు..!
- August 06, 2024
దోహా: సరళీకృత వీసా విధానాలు, అనేక టూరిజం ఆఫర్‌లు వెరసి ఖతార్ ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో పర్యాటకులు, సందర్శకులను స్వాగతిస్తోంది. ఖతార్ టూరిజం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. జూలై 2024లో 317,000 మంది టూరిస్టులు వచ్చారు. ఏడు నెలల కాలంలో సందర్శకుల సంఖ్యను 2.956 మిలియన్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26.2 శాతం పెరిగింది. 2023లో అత్యధికంగా నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ మంది సందర్శకులు వచ్చారు. 0.86 మిలియన్ల మంది సందర్శకులతో సౌదీ అరేబియా అగ్రస్థానంలో ఉంది. 238,000 మంది సందర్శకులతో ఇండియా తర్వాతి స్థానంలో ఉండగా, 135,000 మంది సందర్శకులతో బహ్రెయిన్ మూడవ స్థానంలో ఉంది. ఇతర అగ్ర దేశాల జాబితాలో కువైట్, ఒమన్, అమెరికా, యూకే, యూఏఈ, జర్మనీ మరియు చైనా ఉన్నాయి.
హయ్యా ప్లాట్‌ఫారమ్ ద్వారా విజిట్ వీసా విధానాలను సులభతరం చేయడం పర్యాటక రంగం వృద్ధికి కీలకమైనది. ఖతార్ 102 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుంది. మిగిలిన వారు హయ్యా ప్లాట్‌ఫారమ్ ద్వారా ఇ-వీసా పొందవచ్చు. గత సంవత్సరం ప్రయాణ, పర్యాటక రంగ GDP సహకారం 31 శాతం పెరిగి QR81.2bnకి చేరుకుంది. ఇది మొత్తం GDPలో 10.3 శాతానికి సమానం అని నివేదిక వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







