రాడార్లతోపాటు ప్రత్యేక కెమెరాలు కూడా!

- June 16, 2016 , by Maagulf

దుబాయ్‌ పోలీసులు రోడ్లపై నిబంధనల్ని ఉల్లంఘించేవారికోసం రాడార్లతోపాటు 2000 కెమెరాలను కూడా వినియోగించనున్నారు. రోడ్లపై మొత్తం 2000 కెమెరాలను ఇప్పటికే ఇన్‌స్టాల్‌ చేసినట్లు దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. 'వి ఆర్‌ ఆల్‌ పోలీస్‌' పేరుతో ఈ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. పవిత్ర రమదాన్‌ మాసం సందర్భంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు, అలాగే నిబంధనల్ని అతిక్రమించేవారిని తేలికగా గుర్తించి, వారిపై చర్యలు తీసుకునేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేశామని కల్నల్‌ సైఫ్‌ ముహైర్‌ అల్‌ మజ్రోయి చెప్పారు. రమదాన్‌ తొలి రోజున 250 యాక్సిడెంట్లు జరిగాయనీ, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ 2419 ఎమర్జన్సీ కాల్స్‌ని రిసీవ్‌ చేసుకుందని ఆయన చెప్పారు. మోటరిస్టులు రూల్స్‌ని పాటించడం ద్వారా సేఫ్టీతో కూడిన ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేశారాయన. ఇవే కాకుండా పెట్రోలింగ్‌ని కూడా స్మార్ట్‌గా మార్చారు. ఈ పెట్రోలింగ్‌ వాహనాల్లో 360 డిగ్రీల మేర కవర్‌ చేసేలా కెమెరాలను ఏర్పాటు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com