మచిలీపట్నం-తిరుపతి రైలు కు కసరత్తు: ఎంపీ బాలశౌరి

- August 07, 2024 , by Maagulf
మచిలీపట్నం-తిరుపతి రైలు కు కసరత్తు: ఎంపీ బాలశౌరి

అమరావతి: మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి మేరకు మచిలీపట్నం నుంచి తిరుపతికి వెళ్ళేందుకు రైలుని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసిన రైల్వే ఉన్నతాధికారులు. నేటి రాత్రి నుండే ఈ సదుపాయాన్ని పునరుద్దరించిన రైల్వే అధికారులు. 

ఈ సౌకర్యాన్ని ఎంతమంది ప్రయాణీకులు వినియోగించుకుంటారో తెలుసుకోడానికి ఈరోజు మరియు 9వ తేదీన ఈ రైలుని నడపబోతున్నారు. దీనిని బట్టి తిరుపతి రైలు సర్వీస్ ని కొనసాగించనున్నారు. నూతన భోగీలతో ఇప్పటికే మచిలీపట్నం రైల్వే స్టేషన్ కు చేరుకున్న తిరుపతి వెళ్లే రైలు.

ఇటీవల గన్నవరం నుంచి ముంబయి నగరానికి ఫ్లైట్ వేయించిన ఎంపీ బాలశౌరి; నేడు మచిలీపట్నం - తిరుపతి, ఈనెల 11 నుంచి మచిలీపట్నం - విశాఖపట్నంకి రైలు సర్వీసులను పునరుద్దరించి ప్రజల మన్నలను అందుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com