డెల్‌లో 12,500 మంది ఉద్యోగుల ఉద్వాసన!

- August 07, 2024 , by Maagulf
డెల్‌లో 12,500 మంది ఉద్యోగుల ఉద్వాసన!

టెక్‌ కంపెనీల్లో లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది. ఇటీవల ఇంటెల్‌ సంస్థ పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించగా..తాజాగా ప్రముఖ కంప్యూటర్ల తయారీ సంస్థ డెల్‌ సైతం అదే బాటపట్టింది. దాదాపు 12,500 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇది కంపెనీ శ్రామిక శక్తిలో 10 శాతంతో సమానం. ఈ విషయాన్ని కంపెనీ తాజా ప్రకటనలో వెల్లడించింది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) యుగంలో తమ వ్యాపారాన్ని పునరుద్ధరించడంపై దృష్టి సారించామని, వృద్ధిపై దృష్టి సారించామని డెల్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగానే సేల్స్‌ విభాగంలో ఉద్యోగులను తగ్గించుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతర్గత మెమోల ద్వారా ఆగస్టు 6న తొలగింపుల విషయాన్ని ఉద్యోగులకు తెలియజేశారు. అందులో పెట్టుబడులకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే, వ్యాపారాన్ని నిరంతం అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తున్నట్లు అందులో కంపెనీ పేర్కొంది.

తాజా తొలగింపుల్లో ప్రధానంగా మేనేజర్‌లు, సీనియర్‌ మేనేజర్‌లు ఉన్నట్లు సమాచారం. వీరిలో చాలా మంది రెండు దశాబ్దాలకు పైగా అనుభం కలిగి ఉన్నారని తెలుస్తోంది. డెల్‌లో ఫిబ్రవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.20 లక్షల మంది పనిచేస్తున్నారు. డెల్‌ గతేడాదీ లేఆఫ్‌లను ప్రకటించింది. రెండు రౌండ్లలో ఏకంగా 13 వేల మందికి ఉద్వాసన పలికింది. ఇంటెల్‌ సంస్థ ఇటీవల 15వేల మందికి ఉద్వాసన పలికింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com