ఒమాన్ లో 'గల్ఫ్' చిత్రం వీడియో సాంగ్ విడుదల

- July 04, 2015 , by Maagulf
ఒమాన్ లో 'గల్ఫ్' చిత్రం వీడియో సాంగ్ విడుదల

గల్ఫ్ దేశాలలో నివశిస్తున్న ప్రవాస భారతీయుల జీవితాల నేపధ్యంలో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో శ్రావ్య ఫిలింస్ పతాకంపై మిక్కిలి రవీంద్ర బాబు నిర్మిస్తున్న 'గల్ఫ్' చిత్రం ప్రమోషనల్ వీడియో సాంగ్ ని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో మస్కట్ ఇండియన్ సోషల్ క్లబ్ శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో విడుదల చేసారు.

 

సభకు అధ్యక్షత వహించిన కన్వీనర్ అనీల్ కుమార్ మాట్లాడుతూ ఒమాన్ దేశంలో భారతీయులు 15 శాతం మంది నివశిస్తున్నారని, తాము నివశిస్తున్న దేశాభివృద్ధికి తోడ్పడుతూనే భారతదేశానికి కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం అందిస్తున్నామని, ప్రవాస భారతీయుల విజయాలు, అపజయాలపై తెలుగు లో ఒక చిత్రం రావడం అభినందనీయమన్నారు.

 

సంస్థ కౌన్సిలర్ చిన్నారావు గారు మాట్లాడుతూ దర్శకుడు ఇక్కడివారి సమస్యలనూ, జీవితాలనూ అర్ధం చేసుకోవడానికి గల్ఫ్ దేశాలను పర్యటించడం తమకు చాలా ఆనందంగా వుందని గల్ఫ్ లో నివశించే వారి జీవితాల పట్ల చాలా అపోహలు వున్నాయని, ఈ సినిమా ద్వారా వాటిని తొలగించాలని అభిప్రాయపడ్డారు.

 

కల్చరల్ సెక్రటరీ వేణు గోపాల్ గారు మాట్లాడుతూ ఒమాన్ దేశంలో షూటింగ్ కి చాలా అనుకూలంగా ఉంటుందనీ, చిత్ర షూటింగ్ కి తమవంతు సహకారం ఉంటుందని తెలియజేసారు.

 

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గల్ఫ్ సమస్యలపై అవగాహన కోసం రెండు తెలుగు రాష్ట్రాల లోని పలు జిల్లాలలో పర్యటించడమే కాకుండా గల్ఫ్ లోని అన్ని దేశాలలో తెలుగు ప్రజలను కలుసుకునే ప్రయయ్త్నం చేస్తున్నానని, ఇక్కడ దుబాయ్, షార్జా, అజ్మాన్, ఫుజైరా లు దర్శించాననీ అక్కడ తెలుగు వారు చాలా విషయాలు తెలియజేసారన్నారు.

 

తెలుగువారి సమక్షంలో మస్కట్ లో ప్రమోషనల్ సాంగ్ విడుదల చెయ్యడం చాలా ఆనందంగా ఉందని, ఇక్కడి ఆప్యాయత మరువరానిదన్నారు. త్వరలో ఖతార్, బహ్రెయిన్ లలో కూడా పర్యటించి చిత్రం షూటింగ్ మొదలు పెడతామన్నారు. ఈ చిత్రం ప్రపంచ దేశాలలో తెలుగువారందరినీ అలరిస్తుందనే నమ్మకం తనకుందని తెలిపారు.

 

                                సమర్పణ : రామోజీ ఎంటర్టైన్మెంట్స్

                                 బ్యానర్:     శ్రావ్య ఫిలింస్

                                 సంగీతం:    ప్రవీణ్ ఇమ్మడి

                                ఎక్సేక్యూటివ్ నిర్మాత: బి. బాపిరాజు

                                సహా నిర్మాతలు: కె. విజయ్ కుమార్, డా|| ఎల్. ఎన్. రావు

                                నిర్మాత:       మిక్కిలి రవీంద్ర బాబు

                               దర్సకత్వం:    పి. సునీల్ కుమార్ రెడ్డి

 

సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, గౌరవ సభ్యులు రవి సాయిగారు, రవీంద్రనాథ్ గారు, డా|| రంగయ్య గారు, రామదాస్ గారు, హరిబాబు గారు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com