ఆగస్టు 12న ఖతార్‌లో గరిష్ట స్థాయికి 'పెర్సీడ్’..!

- August 10, 2024 , by Maagulf
ఆగస్టు 12న ఖతార్‌లో గరిష్ట స్థాయికి \'పెర్సీడ్’..!

దోహా: అత్యంత అద్భుతమైన ఖగోళ ప్రదర్శనలలో ఒకటిగా పిలువబడే పెర్సీడ్ ఉల్కాపాతం ఖతార్‌లో సెప్టెంబర్ 1 వరకు కనిపిస్తుంది.ఆగస్టు 12 న గరిష్ట స్థాయికి చేరుకుంటుందని దోహాకు చెందిన ఖగోళ ఫోటోగ్రాఫర్ మరియు ఎవరెస్టర్ అబ్జర్వేటరీ వ్యవస్థాపకుడు  అజిత్ ఎవరెస్టర్ తెలిపారు. ఈ పీక్ రాత్రులలో పెర్సీడ్ ఉల్కాపాతం  ప్రకాశవంతమైన పాయింట్ సుమారు రాత్రి 8 గంటలకు పీక్ స్టేజ్ కి చేరుకుంటుందని తెలిపారు.  ప్రధాన వీక్షణ సమయం చంద్రాస్తమయం తర్వాత ప్రారంభమవుతుంది మరియు ఉదయం 3:45 గంటలకు వరకు కొనసాగుతుంది.

టెలిస్కోప్‌లు లేదా బైనాక్యులర్‌ల అవసరం లేకుండా పెర్సీడ్ ఉల్కాపాతాన్ని కంటితో ఆస్వాదించవచ్చని ఖతార్‌లోని ఔత్సాహిక ఖగోళ శాస్త్రవేత్త నవీన్ ఆనంద్ వెల్లడించారు. "ఖతార్‌లో కాంతి కాలుష్యం మరియు ఇతర కారకాల కారణంగా, గరిష్టంగా గంటకు 60 నుండి 80 ఉల్కల రేటును మేము అంచనా వేస్తున్నాము" అని ఆనంద్ చెప్పారు.  ఈ ఖగోళ సంఘటనను చూసేందుకు ఆసక్తిగా ఉన్నవారి కోసం ఖతార్ స్పేస్ మినిస్ట్రీ, స్పేస్ క్లబ్, ఎవరెస్టర్ అబ్జర్వేటరీతో కలిసి ఆగస్టు 12న అల్ ఖర్రారాలో ఒక పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. పాల్గొనేవారు ఈవెంట్ మార్గదర్శకాల కోసం అజిత్ ఎవరెస్టర్ లేదా నవీన్ ఆనంద్‌ను వాట్సాప్ ద్వారా వరుసగా 55482045 మరియు 30889582లో సంప్రదించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com