ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిభిరం

- August 10, 2024 , by Maagulf
ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిభిరం

హైదరాబాద్: మారిన జీవనశైలి మరియు వివిధ రకాల ఆహారపు అలవాట్ల వల్ల ఫురుషులు, మహిళలు అనే లింగభేధం లేకుండా ప్రస్తుతం చాలా మంది అనేక రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. నోరు, ఛాతీ, ఊపిరితిత్తులు, గొంతు, స్వరపేటిక, రొమ్ము, శ్వాసకోశ, ప్రోస్టేట్‌, పేగు, జీర్ణశయ, కాలేయ క్యాన్సర్ ల వంటి దాదాపు 100కు పైగా క్యాన్సర్‌ రకాలు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 50 ఏళ్ల లోపు వయస్సు గల వారిలో క్యాన్సర్‌ కేసులు ఏకంగా 70 శాతం పెరిగాయి. దేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్‌దే. చాలా రకాల క్యాన్సర్లు ముదరకముందే గుర్తించి చికిత్సను తీసుకోవడం వల్ల ప్రాణాలతో బయటపడుతున్నారు. అందుకోసం *మెడికవర్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ హైటెక్ సిటీ, నందు 11 ఆగస్టు (ఆదివారం), ఉ. 10గం॥ల నుండి సా. 5గం॥ల వరకు ఈ క్రింది డాక్టర్లచే ఉచిత కన్సల్టేషన్స్ సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ అంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ, గైనకాలజీ,  జనరల్ సర్జరీ, పల్మనాలజి, ఇ.యన్.టి, జనరల్ ఫిజిషియన్ అందుబాటులో ఉంటారు . ఈ క్రింది లక్షణాలతో బాధపడుతున్నవారు ఈ యొక్క ఉచిత మెగా క్యాన్సర్ స్క్రీనింగ్ వైద్య శిభిరాన్ని సద్వినియోగించుకోగలరు. దీర్ఘకాలిక దగ్గు, దగ్గినప్పుడు రక్తం వచ్చుట, తరచుగా జ్వరం / ఇన్ఫెక్షన్లు వచ్చుట, శరీరం మీద గడ్డలు, లింఫ్ నోడ్స్ వాపు, చనుమొనల నుంచి ద్రవం స్రవించుట, యోని నుంచి అధిక మోతాదులో డిశ్చార్జ్ అవ్వుట, రుతుస్రావం గడ్డలుగా వచ్చుట, కుటుంబ నేపథ్యంలో క్యాన్సర్ ఉన్నవారు, దీర్ఘకాలికంగా పొగ త్రాగు వాడు/ పొగాకు నమిలే వారు, రేడియేషన్ కు అతిగా గురయ్యే వారు, కాలుష్యం / కెమికల్స్ కు దగ్గరగా ఉండేవారు రావచ్చు.

ఈ శిభిరం నందు ఉచిత ఇన్వెస్టిగేషన్స్

కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (Haemoglobin. RBC Count Hematocrit (PCV), MCV,MCH, MCHC,RDW-CV, Platelet Count (PLT), MPV, WBC Count, Differential Count, Neutrophils, Lymphocytes, Monocytes, Eosinophils, Basophils, Peripheral Smear) రాండమ్ బ్లడ్ షుగర్ ,  ప్యాప్స్మియిర్, మామోగ్రఫీ పరీక్షలు నిర్వహించబడును : వివరాలకై సంప్రదించండి 9154316236 , 040 6833 4455.

ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com