సౌదీఅరేబియా పై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసం..చట్టానికి సవరణలు..!

- August 12, 2024 , by Maagulf
సౌదీఅరేబియా పై ప్రపంచ పెట్టుబడిదారుల విశ్వాసం..చట్టానికి సవరణలు..!

రియాద్: అప్డేడేటెడ్ సౌదీ ఇన్వెస్ట్‌మెంట్ చట్టం, దాని కార్యనిర్వాహక నిబంధనలు 2025 ప్రారంభం నుండి అమలులోకి వస్తాయని పెట్టుబడి మంత్రి ఇంజినీర్ ఖలీద్ అల్-ఫాలిహ్ ప్రకటించారు. కొత్త చట్టం పెట్టుబడిదారులకు అపూర్వమైన అవకాశాలను అందిస్తుందని , ప్రపంచ ప్రధాన పెట్టుబడి గమ్యస్థానంగా సౌదీ స్థానాన్ని మెరుగుపరుస్తుందని ఆయన అన్నారు.   కొత్త చట్టం విజన్ 2030 మరియు నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజీ కింద గతంలో ప్రకటించిన సంస్కరణలకు అనుగుణంగా ఉంటుందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ప్రపంచవ్యాప్త క్షీణత మధ్య కూడా పెట్టుబడి కోసం సౌదీ అరేబియా నిబద్ధతను చట్టం ప్రదర్శిస్తుందని తెలిపారు. ఈ చట్టం గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC), వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) మరియు ఇతర ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలు, అంతర్జాతీయ బాధ్యతలకు కూడా అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా ప్రవేశపెట్టిన పెట్టుబడి అనుకూల చర్యలలో పౌర లావాదేవీల చట్టం, ప్రైవేట్ రంగ భాగస్వామ్య చట్టం, కంపెనీల చట్టం, దివాలా చట్టం మరియు ప్రత్యేక ఆర్థిక మండలాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఇన్వెస్టర్స్ కు ప్రోత్సాహకాలు, సౌకర్యాలు మరియు ఎనేబుల్‌లతో పాటు పెట్టుబడిదారులను సానుకూల, మద్దతు మరియు స్థిరమైన పెట్టుబడి వాతావరణాన్ని కోరుకునేలా ప్రేరేపించాయని మంత్రి వెల్లడించారు. స్థూల స్థిర మూలధన నిర్మాణం 2016 నుండి 2023లో దాదాపు $300 బిలియన్లకు 74 శాతం పెరిగి, 2017లో $7.46 బిలియన్ల నుండి 2023లో $19.3 బిలియన్లకు FDI ఇన్‌ఫ్లోలు 158 శాతం పెరిగి, వేగవంతమైన పెట్టుబడి వృద్ధిని పెంచడంలో సహయంగా నిలిచిందన్నారు. FDI బ్యాలెన్స్ 61% పెరిగి 6 సంవత్సరాలలో $215 బిలియన్లకు చేరుకుందని తెలిపారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బ్యాలెన్స్ 2017 మరియు 2023 మధ్య 61 శాతం పెరిగి దాదాపు 215 బిలియన్ డాలర్లకు చేరుకుందని మంత్రి అల్-ఫాలిహ్ తెలిపారు.       

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com