బీమా సంస్థను హెచ్చరించిన సెంట్రల్ బ్యాంక్..!

- August 12, 2024 , by Maagulf
బీమా సంస్థను హెచ్చరించిన సెంట్రల్ బ్యాంక్..!

యూఏఈ: ఒక బీమా సంస్థ నియంత్రణ విధానాలు,  విధానాలలో లోపాలను గుర్తించిన తర్వాత యూఏఈ సెంట్రల్ బ్యాంక్ (CBUAE)  హెచ్చరిక జారీ చేసింది. బీమా పాలసీల కోసం కంపెనీ సేకరించే 'గైడెన్స్ ఆన్ ది పర్సనల్ డేటా'ను ఇన్సూరెన్స్ కంపెనీ ఉల్లంఘిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని రెగ్యులేటర్ ప్రకటించింది.  కంపెనీ పేరును వెల్లడించకుండా, ఇకపై అటువంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని బీమా సంస్థను సెంట్రల్ బ్యాంక్ హెచ్చరించింది.

దేశ ఆర్థిక వ్యవస్థ యొక్క పారదర్శకత,  సమగ్రతను కాపాడేందుకు అన్ని బీమా కంపెనీలు, వాటి యజమానులు, సిబ్బంది యూఏఈ చట్టాలు, నిబంధనలు మరియు ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూడాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రెగ్యులేటర్ స్పష్టం చేసింది. సెంట్రల్ బ్యాంక్ గత నెలలో గెలాక్సీ ఇన్సూరెన్స్ బ్రోకర్ (గెలాక్సీ) లైసెన్స్‌ను రద్దు చేసింది.  అదేవిధంగా ఈ నెల ప్రారంభంలో మనీలాండరింగ్ నిరోధకం, దేశంలోని ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ (AML/CFT) చట్టాలకు ఉల్లంఘించిన ఒక బ్యాంక్‌పై Dh5.8 మిలియన్ల ఆర్థిక జరిమానాను విధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com