ఫుడ్ డెలివరీ వాహనాలు.. షార్జాలో హెచ్చరిక జారీ

- August 13, 2024 , by Maagulf
ఫుడ్ డెలివరీ వాహనాలు.. షార్జాలో హెచ్చరిక జారీ

షార్జా: సరైన అనుమతులు లేకుండా నడుపుతున్న ఆహార రవాణా, డెలివరీ వాహనాలపై తనిఖీ ప్రచారాలను షార్జా మున్సిపాలిటీ ముమ్మరం చేస్తోంది. వినియోగదారులకు సురక్షితమైన ఆహారాన్ని అందించడానికి మరియు ఎమిరేట్ అంతటా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి ఈ ఆకస్మిక తనిఖీలు చాలా అవసరం అని ఒక ఉన్నత అధికారి తెలిపారు. ఆహార రవాణా వాహనాలను తనిఖీ చేయడం ఆహార సంస్థలను పరిశీలించినంత కీలకమైనదని హెల్త్ కంట్రోల్ అండ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జమాల్ అల్ మజ్మీ తెలిపారు.

లైసెన్స్ లేని ఆహార రవాణా వాహనాలతో జాగ్రత్తగా ఉండాలని నివాసితులు, ఆహార సంస్థలను కోరారు. ఇటువంటి పద్ధతులు ఆహార భద్రతకు తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని పేర్కొన్నారు. ఆహార రవాణా వాహనాల ఆపరేటర్లు ఆహార నియంత్రణ శాఖ నిర్దేశించిన కఠినమైన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. ఆహారేతర వస్తువుల కోసం వాహనాలను ఉపయోగించకుండా చూసుకోవడం, పరిశుభ్రతను నిర్వహించడం వంటివి ఉన్నాయి. ఈ నిబంధనలకు కట్టుబడి ఉండటం ద్వారా ఆహార భద్రతను మెరుగుపరచడం, ఎమిరేట్ అంతటా ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నట్టు షార్జా మునిసిపాలిటీ వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com