నానికి ఇంకో హిట్టు పక్కా.!

- August 14, 2024 , by Maagulf
నానికి ఇంకో హిట్టు పక్కా.!

నేచురల్ స్టార్ నాని వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ ఫుల్ స్వింగ్ మీదున్నాడు. ‘దసరా’, ‘హాయ్ నాన్న’ ఇలా డిఫరెంట్ సినిమాలతో దూసుకొస్తున్నాడు.

హిట్, ఫట్ అనే తేడా లేకుండా తనదైన దారిలో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఏడాదికి రెండు సినిమాలు నాని నుంచి పక్కాగా వస్తున్నాయ్.

తాజాగా ‘సరిపోదా శనివారం’ సినిమాతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఆగస్టు 29న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది.

నాని కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా ప్యాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా రిలీజవుతోంది. మొదట్నుంచీ ఈ సినిమాపై అంచనాలున్నాయ్.

ట్రైలర్ వచ్చాకా ఆ అంచనాలు ఆకాశాన్నంటేశాయ్. సినిమాలో విలన్‌గా ఎస్.జె. సూర్య నటిస్తున్న సంగతి తెలిసిందే. సోకులపాలెం అనే ప్రాంతంలోని ప్రజల చుట్టూ సాగే కథే ఈ ‘సరిపోదా శనివారం’ సినిమా.

దయ అనే పోలీసాఫీసర్ పాత్రలో ఎస్.జెసూర్య నటించారు. ప్రజల్ని అనవసరంగా చిత్ర హింసల పాలు చేస్తుంటాడు. ఆ కష్టాల నుంచి ప్రజల్ని సూర్య ఎలా కాపాడాడు.? అసలు శనివారం మాత్రమే సూర్యకి ఎందుకంత కోపం వస్తుంది.? ‘కోపమొస్తే వీడు నా వాడు..’ అనే డైలాగ్ నాని ఎందుకు చెప్పాడు.? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ వున్నాయ్ ఈ సినిమాలో. ట్రైలర్‌తో ఇంకా చాలా క్లారిటీ వచ్చింది. చూడాలి మరి, నాని కాన్ఫిడెన్స్ నిజమవుతుందా.? లేదా.?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com