గుడ్ న్యూస్.. అబుదాబిలో వారంపాటు అందుబాటులో స్మార్ట్ ట్రైన్..!

- August 15, 2024 , by Maagulf
గుడ్ న్యూస్.. అబుదాబిలో వారంపాటు అందుబాటులో స్మార్ట్ ట్రైన్..!

యూఏఈ: అబుదాబి లో ఆటోమేటెడ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ (ART)  హై-టెక్ రవాణా వ్యవస్థ వారం రోజుల పాటు పొడిగించిన గంటలతో పనిచేయడం ప్రారంభించింది. ఇది ప్రయాణికులలో పెరుగుతున్న ప్రజాదరణను సూచిస్తుందని అధికారులు తెలిపారు. గత ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన వినూత్న, స్థిరమైన ARTల పైలట్ దశ రీమ్ మాల్ - మెరీనా మాల్‌లను కలుపుతుంది. ప్రారంభంలో ఇది శుక్రవారం నుండి ఆదివారం వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సేవలు అందించింది. ట్రామ్ లాంటి పర్యావరణ అనుకూల రవాణా విధానం ఇప్పుడు వారం రోజులపాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ప్రస్తుతం ARTలు సోమవారం నుండి శుక్రవారం వరకు నడుస్తున్నాయి. చివరి సర్వీస్ రాత్రి 8 గంటల వరకు పొడిగించారు. పబ్లిక్ బస్‌తో పోలిస్తే ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి తాను తరచుగా దీన్ని ఉపయోగించడానికి ప్రయత్నిస్తానని ఎలెక్ట్రా స్ట్రీట్‌లోని అపార్ట్‌మెంట్‌లో నివసించే పాల్ ఆల్ఫ్రెడో చెప్పారు. 

స్మార్ట్ మొబిలిటీ సొల్యూషన్ అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగిస్తుంది. ఏకకాలంలో 200 మంది ప్రయాణికులను రవాణా చేయగలదు. రీమ్ మాల్ నుండి మెరీనా మాల్ మధ్య 27 కి.మీ మార్గంలో దీని సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇది మెరీనా స్క్వేర్, గల్లెరియా అల్ మరియాహ్ ద్వీపం, కస్ర్ అల్ హోస్న్, ఖలీదియా పార్క్, షేఖా ఫాతిమా పార్క్, అబుదాబి ఎనర్జీ సెంటర్, NMC స్పెషాలిటీ వంటి ప్రముఖ గమ్యస్థానాలలో ఆగుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com