స్కిల్ వర్శిటీ లో ఆరు కోర్సులు: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- August 17, 2024
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు రూపు దిద్దుకున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా పలు రంగాల్లో కోర్సులను దసరా పండగ నుంచి ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. స్కిల్ యూనివర్సిటీ ద్వారా దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని గుర్తించడం జరిగిందని, వీటిలో దసరా పండగ నుంచి ప్రాథమికంగా ఆరు కోర్సులను ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిపారు.
ఈ స్కిల్ యూనివర్సిటీ ప్రారంభం, విధి విధానాల ఖరారు, కోర్సుల ప్రారంభం తదితర అంశాలపై నేడు ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి.ఎస్. శాంతి కుమారి మాట్లాడుతూ.. ముచ్చర్ల వద్ద కేటాయించిన 57 ఎకరాల స్థలంలో ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని, ఈ నిర్మాణ పనులు ముగిసేంత వరకు ఈ యూనివర్సిటీని తాత్కాలిక భవనంలో నిర్వహించనున్నట్టు తెలిపారు.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







