తెలుగులో ‘తంగలాన్’ని పట్టించుకోలేదేం.!
- August 18, 2024 
            విలక్షణ నటుడు విక్రమ్ సినిమాలకు తెలుగులోనూ మంచి మార్కెట్ వుంది. ‘అపరిచితుడు’ తదితర సినిమాలు గతంలో తెలుగులోనూ మంచి వసూళ్లు రాబట్టాయ్.
తాజాగా విక్రమ్ ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండు తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో పాటూ వచ్చిన ఈ సినిమాకి మంచి రివ్యూసే వచ్చాయ్.
అదే రోజు రిలీజైన ‘మిస్టర్ బచ్చన్’, ‘డబుల్ ఇస్మార్ట్’ సో సో టాక్ సొంతం చేసుకుంటే, ‘తంగలాన్’ బాగుందన్న టాక్ దక్కించుకుంది. పాజిటివ్ రివ్యూస్ వచ్చాయ్.
కానీ, ఎందుకో తెలీదు తెలుగు మీడియా ‘తంగలాన్’ని లైట్ తీసుకుంది. డిఫరెంట్ స్టోరీ, విక్రమ్ పర్ఫామెన్స్, మాళవిక పాత్ర.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయ్ ఈ సినిమాలో.
కానీ, సరైన ప్రచారం లేక ఈ సినిమా సోదిలో లేకుండా పోయింది. మరోవైపు విక్రమ్, మాళవిక మోహనన్ అండ్ టీమ్ సినిమాని తెలుగులోనూ బాగానే ప్రమోట్ చేశారు.
మాళవిక విషయానికి వస్తే, ఓ వైపు ‘రాజా సాబ్’ షూటింగ్‌తో బిజీగా వున్నప్పటికీ ‘తంగలాన్’ ప్రమోషన్లకు సైతం హాజరయ్యింది. ఏం జరిగిందో ఏమో కానీ, తెలుగు మీడియా మాత్రమే ఈ సినిమాని పక్కన పెట్టేసింది. అయినా కంటెంట్ బాగుంటే, ఆ సినిమా సక్సెస్‌ని ఆపడం ఎవ్వరి తరం కాదు.
లాంగ్ వీకెండ్, రక్షా బంధన్ వంటి సెలవులు కలిసి రావడం.. ఈ వారం సినిమాలకు బాగా తకలిసొచ్చే అంశమే. రిజల్ట్‌తో సంబంధం లేకుండా వసూళ్ల లెక్క ఏ సినిమాలకు పక్కాగా వుంటుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..







