మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల..

- August 18, 2024 , by Maagulf
మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్‌ షెడ్యూల్ విడుదల..

న్యూ ఢిల్లీ: అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025 మ‌హిళ‌ల అండ‌ర్ -19 ప్ర‌పంచ‌క‌ప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. మ‌లేషియా వేదిక‌గా ఈ మెగా టోర్నీ జ‌ర‌గ‌నుంది. జ‌న‌వ‌రి 18 నుంచి ఫిబ్ర‌వ‌రి 2 వ‌రకు ఈ టోర్నీని నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం 16 జ‌ట్లు పాల్గొంటున్నాయి.ఈ జ‌ట్ల‌ను నాలుగు గ్రూపులుగా విభ‌జించారు. ప్ర‌తి గ్రూపులో మొద‌టి మూడు స్థానాల్లో నిలిచిన జ‌ట్లు సూప‌ర్ సిక్స్‌కు చేరుకుంటాయి.

సూప‌ర్ సిక్స్‌కు చేరుకున్న 12 జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జిస్తారు. ప్ర‌తి గ్రూపులో టాప్‌-2లో నిలిచిన జ‌ట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. సెమీస్‌, పైన‌ల్‌తో క‌లిపి మొత్తం 41 మ్యాచులు జ‌ర‌గ‌నున్నాయి. ఇక భార‌త జ‌ట్టు గ్రూపు-ఏలో ఉంది. భార‌త్‌తో పాటు వెస్టిండీస్‌, శ్రీలంక, మలేసియాలు గ్రూపు-ఏలో ఉన్నాయి.

ఇక‌ గ్రూప్‌ బిలో ఇంగ్లాండ్, పాకిస్థాన్‌, ఐర్లాండ్, యూఎస్ఏ లు ఉన్నాయి. గ్రూప్‌ సిలో న్యూజిలాండ్, ద‌క్షిణాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవాలు గ్రూప్ డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఆసియా క్వాలిఫయర్‌, స్కాట్లాండ్ ఉన్నాయి.

ఫిబ్ర‌వ‌రి 1 సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు, ఫిబ్ర‌వ‌రి 3 ఫైనల్‌ రిజర్వ్ డేలు ప్ర‌క‌టించారు. భారత్‌ సెమీ ఫైనల్స్‌కు వెళ్తే జనవరి 31న రెండో సెమీ ఫైనల్‌ ఆడునుంది. కాగా.. అండ‌ర్ 19 స్థాయిలో ఇది రెండో టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌. 2023లో తొలిసారిగా నిర్వ‌హించిన ఈ టోర్నీలో భార‌త్ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com