మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- August 18, 2024
న్యూ ఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2025 మహిళల అండర్ -19 ప్రపంచకప్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది. మలేషియా వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు ఈ టోర్నీని నిర్వహించనున్నారు. మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి.ఈ జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్‌కు చేరుకుంటాయి.
సూపర్ సిక్స్‌కు చేరుకున్న 12 జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ప్రతి గ్రూపులో టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు చేరుకుంటాయి. సెమీస్, పైనల్‌తో కలిపి మొత్తం 41 మ్యాచులు జరగనున్నాయి. ఇక భారత జట్టు గ్రూపు-ఏలో ఉంది. భారత్‌తో పాటు వెస్టిండీస్, శ్రీలంక, మలేసియాలు గ్రూపు-ఏలో ఉన్నాయి.
ఇక గ్రూప్ బిలో ఇంగ్లాండ్, పాకిస్థాన్, ఐర్లాండ్, యూఎస్ఏ లు ఉన్నాయి. గ్రూప్ సిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్రికా క్వాలిఫయర్, సమోవాలు గ్రూప్ డిలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆసియా క్వాలిఫయర్, స్కాట్లాండ్ ఉన్నాయి.
ఫిబ్రవరి 1 సెమీ ఫైనల్ మ్యాచ్‌లకు, ఫిబ్రవరి 3 ఫైనల్ రిజర్వ్ డేలు ప్రకటించారు. భారత్ సెమీ ఫైనల్స్‌కు వెళ్తే జనవరి 31న రెండో సెమీ ఫైనల్ ఆడునుంది. కాగా.. అండర్ 19 స్థాయిలో ఇది రెండో టీ20 ప్రపంచకప్. 2023లో తొలిసారిగా నిర్వహించిన ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్‌లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!
- ఒమన్ రోడ్లపై స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..!!
- ఎయిర్ ఏషియా బహ్రెయిన్‌లో మిడిల్ ఈస్ట్ హబ్ ప్రారంభం..!!
- వన్డే ప్రపంచకప్ విజయం.. భారత మహిళల క్రికెట్ టీమ్ పై బీసీసీఐ కోట్ల వర్షం..
- రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, కంకర లారీ ఢీ.. 19 మంది మృతి..
- షార్జాలో ప్రొటెక్ట్ యానిమల్స్ బిజినెస్..వ్యక్తి అరెస్టు..!!
- రెడ్ క్రెసెంట్ లోగో దుర్వినియోగం..ఏడాది జైలు, SR1 మిలియన్ ఫైన్..!!







