రైల్వేస్టేషన్లలో ఫ్రీగా వై-ఫై సౌకర్యం..
- August 18, 2024
న్యూ ఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారతీయ రైల్వే తమ ప్రయాణికుల కోసం అనేక కొత్త సౌకర్యాలను ప్రవేశపెడుతోంది. ఏపీ రైల్వే జోన్, తెలంగాణ రైల్వే జోన్ సహా దేశవ్యాప్తంగా మొత్తం 6,100 రైల్వే స్టేషన్లలో ఫ్రీ హైస్పీడ్ వై-ఫై ఫెసిలిటీని అందిస్తోంది. ప్రతి ప్రయాణికుడు రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాల పాటు ఫ్రీ-హైస్పీడ్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. ఈశాన్య భారత్ నుంచి కాశ్మీర్ లోయ వరకు ప్రయాణికులు ఈ వై-ఫై సౌకర్యాన్ని పొందవచ్చు.
రైల్‌వైర్ అనే వై-ఫై ఇంటర్నెట్ సర్వీసు అన్ని రైల్వే స్టేషన్‌లలో అందుబాటులో ఉంది. 30 నిమిషాల ఉచిత వై-ఫై సర్వీసు తర్వాత కొద్దిపాటి ధరతో మరికొంత సమయం వాడుకోవచ్చు. రైల్‌వైర్ ద్వారా రైల్‌టెల్ వై-ఫై సౌకర్యం పొందవచ్చు. మీకు అవసరమైన డేటా ప్లాన్ కూడా ఎంచుకోవచ్చు. రైల్వే స్టేషన్‌కు వచ్చే ప్రయాణికులకు రైల్‌టెల్ వివిధ రకాల ప్లాన్‌లను అందిస్తోంది. రైల్‌టెల్ అనేది రిటైల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్.. వై-ఫై ప్లాన్ల వివరాలను పొందాలంటే రైల్‌టెల్ వెబ్‌సైట్ (https://www.railtel.in/) చూడొచ్చు.
ఈ వై-ఫై ఇంటర్నెట్ 1ఎమ్‌బీపీఎస్ స్పీడ్ అందిస్తుంది. 30 నిమిషాల తర్వాత ఇంటర్నెట్ వినియోగం కోసం కొంత చెల్లించాలి. రైల్‌వైర్ ఇంటర్నెట్ డేటా ప్యాక్‌లు రూ. 10 అందుబాటులో ఉంటాయి. 34ఎమ్‌బీపీఎస్ స్పీడ్‌తో 5జీబీ ఇంటర్నెట్ డేటాను పొందవచ్చు. డేటా వ్యాలిడిటీ 24 గంటలు ఉంటుంది.
https://www.railwire.co.in/) వెబ్‌సైట్ ద్వారా ఫుల్ డేటాను పొందొచ్చు. ఈ ఫ్రీ వై-ఫై సర్వీసెస్ కేవలం రైల్వే స్టేషన్‌లో మాత్రమే పనిచేస్తుంది. రైలు ప్రయాణంలో మాత్రం రైల్‌వైర్ ఇంటర్నెట్ పనిచేయదని గమనించాలి. అయితే, వై-ఫై ప్లాన్ పేమెంట్ కోసం నెట్‌బ్యాంకింగ్, వ్యాలెట్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్‌లో ఫ్రీ వై-ఫై ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫ్రీ వై-ఫై ఎలా కనెక్ట్ చేయాలంటే?
- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్లో రైట్ సైడ్ టాప్‌లో కనిపించే వై-ఫై ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
- ఆన్ చేసి రైల్‌వైర్ వై-ఫై నెట్‌వర్క్‌ని సెలెక్ట్ చేసుకోండి.
- మొబైల్ బ్రౌజర్‌తో https://www.railwire.co.in/ వెబ్ పేజీని ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
- మీ హై స్పీడ్ వై-ఫై పాస్‌వర్డ్ మీ ఫోన్‌కి ఓటీపీ రూపంలో వస్తుంది.
- మీరు 30 నిమిషాల వరకు ఫ్రీ ఇంటర్నెట్ వాడొచ్చు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







