అక్టోబర్ 4 నుంచి 12 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు
- August 19, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వ తేది వరకు నవాహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3 వ తేది సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.
వాహన సేవల వివరాలు...
4-10-20204 : సాయంత్రం 5.45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్దశేష వాహనం.
5-10-2024 : ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం.
6-10-2024 : ఉదయం 8 గంటలకు సింహవాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనం.
7-10-2024 : ఉదయం 8 గంటలకు కల్పవృక్ష వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనం.
8-10-2024 : ఉదయం 8 గంటలకు మోహిని అవతారం, రాత్రి 6.30 నుంచి రాత్రి 11.30 గంటల వరకు గరుడ వాహనం.
9-10-2024 : ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణరథం, రాత్రి 7 గంటలకు గజవాహనం.
10-10-2024 : ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం.
11-10-2024 : ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వవాహనం.
12-10-2024 : ఉదయం 6 నుంచి 9 గంటల వరకు చక్రస్నానం, రాత్రి 8.30 నుంచి 10.30 వరకు ధ్వజావరోహణం.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు