ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత
- August 24, 2024
హైదరాబాద్: సినీ నటుడు నాగార్జున కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. మాదాపూర్‌లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్‌కన్వెన్షన్ హాల్‌ను నిర్మించారనే ఆరోపణలు ఎప్పటి నుండో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం పత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైనా పిర్యాదులు వచ్చాయి. ఎన్ కన్వెన్షన్ ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణం కు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించి..అక్రమంగా నిర్మాణం జరిగిందని తేలడంతో ఉదయం JSB లతో ఎన్‌కన్వెన్షన్ ను కూల్చేశారు. ఎన్ కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను అధికారులు మూసేసి..కనీసం మీడియాకు సైతం అనుమతి ఇవ్వకుండా రెండు గంటల్లో కూల్చేశారు.
హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద ‘హైడ్రా’ స్పెషల్ ఫోకస్ పెట్టింది హైడ్రా. కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే కూల్చివేస్తున్నారు. పార్టీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్‌హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా కూల్చివేయడానికి సిద్ధమైంది. అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ పడింది.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్‌ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







