హజ్ యాత్ర-2016 ఆగస్టు 21 నుంచి...

- June 17, 2016 , by Maagulf
హజ్ యాత్ర-2016 ఆగస్టు 21 నుంచి...

హజ్ యాత్ర-2016 ఆగస్టు 21 నుంచి ప్రారంభమవుతుందని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఏ షుకూర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ 2 ఎయిర్‌ఇండియా విమానాల్లో సుమారు 340 మంది యాత్రికుల చొప్పున జెద్దాకు బయలుదేరుతారన్నారు. చివరి రోజైన ఆగస్టు 28న ఒకే విమానం బయలుదేరి వెళ్తుందన్నారు.హజ్ ప్రార్థనల అనంతరం యాత్రికులు హైదరాబాద్‌కు అక్టోబర్ 4 నుంచి 11 వరకు తిరుగు ప్రయాణమవుతారని తెలిపారు. హజ్ యాత్రికుల కోసం హజ్ హౌస్‌లో ప్రత్యేక క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. హజ్ యాత్రికులు 2 విడతల చార్జీలను జూలై 2 వరకు చెల్లించాలని ఆయన సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com