అమెరికాలో NATS పికిల్ బాల్ టోర్నమెంట్‌కు చక్కటి స్పందన
- August 27, 2024
అమెరికా: చికాగో ఆగస్ట్:25 అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తెలుగువారు అధికంగా ఉండే చికాగోలో మొదటిసారి పికిల్‌బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. నాట్స్ చికాగో విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నమెంట్‌కు చక్కటి స్పందన లభించింది. 150 మందికి పైగా ఆటగాళ్లు ఎంతో ఉత్సాహంగా ఈ టోర్నమెంట్లో పాల్గొన్ని క్రీడా స్ఫూర్తిని చాటారు. నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్‌ని తొలిసారి నిర్వహించిన నాట్స్ చికాగో విభాగం సభ్యులను, క్రీడాకారులను నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి అభినందించారు. తెలుగువారిని కలిపేందుకు ఇలాంటి ఆటల పోటీలు దోహదం చేస్తాయని మదన్ పాములపాటి అన్నారు. నాట్స్ పికిల్ బాల్ టోర్నమెంట్ దిగ్విజయం చేయడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ చికాగో పికిల్ బాల్ టోర్నమెంట్‌ను చక్కటి ప్రణాళిక, సమన్వయంతో నిర్వహించిన చికాగో చాప్టర్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ ఎక్కుర్తిని నాట్స్ నాయకత్వం ప్రత్యేకంగా అభినందించింది. నాట్స్ చికాగో విభాగం నాయకులు సిరి బచ్చు, భారతి కేసనకుర్తి, ఈశ్వర్ వడ్లమన్నాటి, చెన్నయ్య కంబాల, నవీన్ జరుగుల, నరేంద్ర కడియాల, మహేష్ కిలారు, గోపి ఉలవ, పాండు చెంగలశెట్టి, అంజయ్య వేలూరు ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించినందుకు వారిని నాట్స్ జాతీయ నాయకులు ప్రశంసించారు.
ఈ టోర్నమెంట్‌కు కావాల్సిన సౌకర్యాలు, వేదిక, ఆహారం ఏర్పాటు చేసిన నాట్స్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, కార్య నిర్వాహక సభ్యులు ఆర్.కె బాలినేని, హరీష్ జమ్ముల, ఇమ్మాన్యుయేల్ నీల, నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ బొప్పన తదితరులను నాట్స్ నాయకత్వం అభినందించింది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







