ఆడిటింగ్..ఇండియా, బహ్రెయిన్ మధ్య కీలక ఒప్పందం..!

- August 29, 2024 , by Maagulf
ఆడిటింగ్..ఇండియా, బహ్రెయిన్ మధ్య కీలక ఒప్పందం..!

మనామా: కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే దిశగా ముందడుగు వేసింది. మనామాలోని నేషనల్ ఆడిట్ ఆఫీస్, బహ్రెయిన్ లో ఉన్న SAI బహ్రెయిన్‌తో అవగాహన ఒప్పందం (MOU)పై సంతకం చేసింది.  ఆడిట్ కార్యకలాపాల రంగాలలో సహకారం, పరస్పర సహకారాన్ని పెంపొందించడం, రెండు దేశాల సిబ్బంది సభ్యుల వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎమ్ఒయు ద్వారా శిక్షణా కార్యకలాపాలను ప్రోత్సహించడం, నిపుణుల సందర్శనలు,  ఆడిటింగ్ రంగాలలో సాంకేతిక సమాచారం,  పరిశోధన అవుట్‌పుట్ మార్పిడి కోసం ఒక వేదిక ఏర్పాటు చేయబడుతుందని CAG ఉన్నతాధికారి  గిరీష్ చంద్ర ముర్ము తెలిపారు. మనామా పర్యటన సందర్భంగా CAG బృందం బహ్రెయిన్‌లోని ఒడియా సంఘంతో సమావేశమైంది. ప్రపంచ వేదికపై ఒడిషా గుర్తింపును పెంపొందించడంలో బహ్రెయిన్ ఒడియా సంఘం పాత్రను ప్రశంసించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com