రజినీ అభిమానులకోసం ఓ ప్రత్యేక ప్యాకేజీ : ఎయిర్‌ ఏసియా..

- June 18, 2016 , by Maagulf
రజినీ అభిమానులకోసం ఓ ప్రత్యేక ప్యాకేజీ : ఎయిర్‌ ఏసియా..

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా నటించిన 'కబాలి' చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు... తమిళనాడు రాష్ట్ర ప్రజల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం అక్కడ 'కబాలి'నే హాట్‌ టాపిక్‌. అలాగని బెంగళూరు అభిమానులేం తక్కువ కాదు... వారూ అంతే ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అందుకని ఈ చిత్ర బృందం బెంగళూరులోని రజినీ అభిమానులకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తోంది. చిత్రం విడుదల రోజున ఫస్ట్‌ డే ఫస్ట్‌షోకు బెంగుళూరు నుంచి చెన్నైకి ప్రత్యేకంగా ఎయిర్‌ ఏసియా విమానాన్ని నడుపుతున్నట్లు తమిళ వర్గాలు చెబుతున్నాయి.
'కబాలి' చిత్రంలోని కొన్ని సన్నివేశాల కోసం ఎయిర్‌లైన్‌ అవసరం వచ్చిందట.
ఇందులో భాగంగానే ఎయిర్‌ ఏసియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దాంతో ఎయిర్‌ ఏసియా రజినీ అభిమానులకోసం ఓ ప్రత్యేక ప్యాకేజీ రూపొందించింది. ఇప్పటికే ప్రయాణికులకోసం కబాలి ప్రత్యేక మెనూ తయారు చేస్తున్నట్లు సమాచారం. ఈ బెంగళూరు - చెన్నై - బెంగళూరు ప్యాకేజిలో రాను పోను టికెట్‌, సినిమా టికెట్‌, లంచ్‌ కూడా కలిసి మొత్తం..రూ.7860. ఇది సినిమా రిలీజ్‌ అయిన రోజున మాత్రమే సుమా!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com