టాలీవుడ్‌కి మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికేశాడోచ్.!
- August 31, 2024
టాలీవుడ్లో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి చాలా కాలమైంది. దాంతో, ఎటు చూసినా థమన్, దేవిశ్రీ ప్రసాద్, సీనియర్లు ఒకరో ఇద్దరో కీరవాణిలాంటోళ్లు తప్ప ఎవ్వరూ కనిపించడం లేదు. ‘ఖుషి’ సినిమాతో పరిచయమైన మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ వహాద్ అబ్ధుల్ హసిమ్ రెండు మూడు సినిమాలకే పరిమితమయ్యాడు.
దాంతో, కొత్తదనం చూపించే మ్యూజిక్ డైరెక్టర్ లేక, కాపీ మ్యూజిక్ టూన్స్ తట్టుకోలేక ప్రేక్షకులు నిరాశ చెందుతున్న సంగతి తెలిసిందే. అలాంటి ప్రేక్షకులకి నాని నటించిన ‘సరిపోదా శనివారం’ సినిమాతో ఓ కొత్త మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు.
ఆయనే జేక్స్ బిజోయ్. ఇప్పుడు టాలీవుడ్ అంతా మార్మోగిపోతున్న పేరు ఇదే. ‘సరిపోదా శనివారం’ సినిమాకి బిజోయ్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌ని జనం మర్చిపోలేకపోతున్నారు. ఏం కొట్టాడ్రా.! అంటూ హ్యాట్సాఫ్ కొట్టేస్తున్నారు.
చూస్తుంటే మనోడికి టాలీవుడ్లో మంచి ఫ్యూచరే వున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటోడు కదా.. టాలీవుడ్‌కి కావల్సింది. ఇంకేముంది.! దొరికేశాడు. దేవిశ్రీ ప్రసాద్, థమన్ కాస్త వెనక్కి జరగాల్సిందేనేమో.!
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్