బుర్ర చురుగ్గా ఉండాలంటే ...
- June 18, 2016
కొత్త చదువులు, సరికొత్త భాష, బాగా ఇష్టపడే విద్య.. నేర్చుకోవడం ఏదైనా సరే మెదడు పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది! 'ఎలా నేర్చుకోవాలి?' అనే విషయంపై ఎన్నెన్నో సూచనలున్నా నేర్చుకోవడానికి మూలమైన బుర్ర చురుగ్గా ఉండాలంటే ఏం చేయాలి? చూద్దామా.
కునుకుపడితే : మధ్యాహ్నం భోజనం ఐదు నుంచి పదినిమిషాలు, ఎప్పుడైనా మగతగా అనిపించినప్పుడు ఓ పావుగంట కునుకు తీయడం మంచిదంటున్నారు నిపుణులు. ఇది మెదడుకి ఎంతో ఉత్సాహాన్నిస్తుందట. గుర్తుపెట్టుకోవడం, విశ్లేషించడం వంటి సామర్థ్యాలనీ పెంచుతుంది.
నిద్రకి ముందు.. : మెదడుకో లక్షణం ఉంది. మన శరీరం బాగా విశ్రాంతి కోరుకుంటున్నప్పుడే ఎక్కువ సృజనాత్మకంగా పనిచేస్తుంది. ముఖ్యంగా నిద్రపోవడానికి కాస్తముందు మనకు బాగా నచ్చిన అభిరుచిని సాధన చేయడం చాలా మంచిదంటారు. సృజన రచన, చిత్రలేఖనం, సంగీత సాధన.. ఏదైనా కావొచ్చు మీరు పడగ్గదికి వెళ్లేలోపు సాధన చేస్తే ఫలితం అద్భుతంగా ఉంటుందట.
కాలినడక చాలు : చురుకైన వ్యాయామం కూడా మన మెదడు సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా కార్డియో వ్యాయామాల వంటివి కేవలం శరీరానికే కాదు బుర్రకీ ఎంతో మేలు చేస్తాయి. రోజుకి కనీసం 15-20 నిమిషాలన్నా వ్యాయామం చేయండి. వ్యాయామశాలకి వెళ్లక్కర్లేదు.. అలసటొచ్చేలా నడిచినా చాలు!
కొత్తవి చేయండి! : కొత్తవి నేర్చుకుంటూనే ఉండండి. రోజూ చేసే పాత పనులైనా సరే.. కొత్తగా ఏదైనా చేయగలరేమో ఆలోచించండి. ఈ 'నవ్యత' మన మెదుడులో ఎప్పటికప్పుడు నూతన న్యూరోట్రాన్స్మీటర్లని సృష్టిస్తుందట.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









