‘బిగ్’ కాంట్రవర్సీ.! అప్పుడే మొదలెట్టేశారుగా.!
- September 03, 2024
బిగ్‌బాస్ అంటేనే కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్. అయితే మెల్ల మెల్లగా స్టార్ట్ అవ్వాల్సిన కాంట్రవర్సీ ఈ సీజన్‌లో మొదటి రోజే.. అదీ ఎంట్రీ రోజే మొదలయ్యింది.
అందుకు కారణం అక్షరాలా బిగ్‌బాసే. ఎంట్రీ డేనే అనిల్ రావిపూడిని హౌస్‌లోకి పంపించి, అక్కడున్న 14 మందిలో ఒకరు హౌస్‌లో వుండేందుకు అర్హులు కారని ఓటింగ్ ద్వారా వాళ్లని ఎంచుకుని బయటికి పంపించాలని మెలిక పెట్టాడు.
అప్పుడే పరిచయమైన వాళ్లు.. అందులోనుంచి అర్హత లేని వాళ్లని ఎలా ఎంచుకోవడం.? అలా నాగ మణికంఠను హౌస్ మేట్స్ ఎంచుకుని బయటికి పంపించేందుకు సిద్ధపడ్డారు.
అలా ఇంటిలోపలి నుంచి నాగ మణికంఠని బయటికి తీసుకొచ్చిన అనిల్ రావిపూడి తూచ్.! ఇదంతా ప్రాంక్ అని మళ్లీ లోపలికి పంపించేశాడు. దాంతో అక్కడే మొదలయ్యింది అసలు గొడవ.
నన్నెలా బయటికి పంపిస్తారు.. అంటూ నాగ మణికంఠ మిగిలిన హౌస్ మేట్స్‌తో పంచాయితీకి దిగాడు. గట్టిగానే రచ్చ జరిగింది వెళ్లిన రోజు రాత్రి.
ఇక, ఆ తర్వాతి రోజు ఫుడ్ విషయంలోనూ అలాంటి రచ్చే. ఈ సీజన్‌కి నో కెప్టెన్ నో రేషన్.. రూల్ పెట్టడంతో అదో రచ్చ. ఎవ్వరి మాటా ఎవ్వరూ వినకుండా.. ఎవరికి వారే తోపుల్లా బిహేవ్ చేశారు.
ఆ తర్వాత కెప్టెన్ లేరు కానీ, ముగ్గురు ఛీఫ్‌లు హౌస్‌లో కీలక పాత్ర పోషిస్తారంటూ అందుకు ఓ పోటీ పెట్టాడు బిగ్‌బాస్. ఆ పోటీలో విన్ అయిన నిఖిల్, నైనిక, యష్మీ ఛీఫ్‌లుగా ఎంపిక కాబడ్డారు.
తాజా వార్తలు
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్