మాదాపూర్, అమీన్పూర్, మల్లంపేటలలో ఆక్రమణలు కూల్చివేస్తున్న HYDRAA
- September 08, 2024
హైదారాబాద్: మాదాపూర్,అమీన్పూర్, మల్లంపేటలలో ఆక్రమణల కూల్చి వెతలను నేటి ఉదయం హైడ్రా చేపట్టింది మాదాపూర్ లోని సున్నపు చెరువులో 43 ఎకరాలు కబ్జాకు గురైనట్లు అధికారులు గుర్తించారు. సున్నపు చెరువులో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. అలాగే బాచుపల్లి బొరంపేట చెరువు పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లాలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా.. అమీన్పూర్లోని హెచ్ఎంటీ కాలనీ, వాణినగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు నిర్వహిస్తున్నారు .. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి.
కాగా, కూల్చివేతలకు హైడ్రా నిర్ణయం.. దుండిగల్ మల్లంపేట కత్వ చెరువు స్థలంలో శ్రీలక్ష్మిశ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలు అక్రమంగా నిర్మించినట్లు గుర్తించింది. దీంతో విల్లాల కూల్చివేతకు సిద్ధమైంది హైడ్రా.. శ్రీలక్ష్మిశ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాల దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి కూల్చి వెతలు ప్రారంభించారు.
తాజా వార్తలు
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …
- షార్జా రాజ కుటుంబంలో విషాదం
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!