‘మత్తు వదలరా 2’ ట్రైలర్ రిలీజ్..

- September 08, 2024 , by Maagulf
‘మత్తు వదలరా 2’ ట్రైలర్ రిలీజ్..

హైదరాబాద్: కీరవాణి చిన్న కొడుకు శ్రీ సింహ కోడూరి హీరోగా మత్తు వదలరా సినిమాతో 2019లో పరిచయమయ్యాడు. కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన మత్తు వదలరా సినిమా అప్పుడు మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా తెరకెక్కింది.

మత్తు వదలరా 2 సినిమాలో శ్రీ సింహ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా, సత్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 13న రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా మత్తు వదలరా 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా ఈ కామెడీ థ్రిల్లర్ ట్రైలర్ చూసేయండి..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com