ఫ్లూ వ్యాక్సిన్ తో ఫ్లూ.. ఖండించిన హెల్త్ అఫీషియల్స్..

- September 10, 2024 , by Maagulf
ఫ్లూ వ్యాక్సిన్ తో ఫ్లూ.. ఖండించిన హెల్త్ అఫీషియల్స్..

యూఏఈ: ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఫ్లూ వస్తుందని ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారాన్ని యూఏఈ ఉన్నత ఆరోగ్య అధికారి ఖండించారు. ఫ్లూ వ్యాక్సిన్ వేసుకున్నాక సాధారణ దుష్ప్రభావాలు కన్పిస్తాయని, అవి ఇంజెక్షన్ స్పాట్‌లో రెడ్ కావడం, కండరాల నొప్పులు, తేలికపాటి జ్వరం మాత్రమే ఉంటుందని అబుదాబి పబ్లిక్ హెల్త్ సెంటర్ (ADPHC)కి చెందిన కమ్యూనికేబుల్ డిసీజెస్ సెక్టార్ యాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ఫైసల్ అలహబాబీ స్పష్టం చేశారు.  కొంతమంది ఈ సాధారణ లక్షణాలను ఫ్లూగా తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. అబుదాబిలో ఫ్లూ షాట్‌ను ఎమిరాటీలు, ప్రవాసులు ఇద్దరికీ ఉచితంగా అందజేస్తున్నారు.  “మీ పిల్లలు అనారోగ్యంతో ఉంటే దయచేసి వారిని పాఠశాలకు పంపకండి. ఒక జబ్బుపడిన పిల్లవాడి నుంచి ఐదు లేదా ఆరుగురికి సులభంగా ఫ్లూ వ్యాపిస్తుంది. ”అని దుబాయ్ హెల్త్‌లోని అల్ జలీలా చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ వాలిద్ అబుహమ్మూర్ తెలిపారు. పిల్లలకు టీకాలు వేయించడం, చేతులను క్రమం తప్పకుండా కడుక్కోవడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం వంటి మంచి పరిశుభ్రత పద్ధతులను పిల్లలకు నేర్పించాలని కోరారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com