సెప్టెంబర్ 1 తర్వాత వీసా ఉల్లంఘనలకు క్షమాభిక్ష పథకం వర్తిస్తుందా?

- September 11, 2024 , by Maagulf
సెప్టెంబర్ 1 తర్వాత వీసా ఉల్లంఘనలకు క్షమాభిక్ష పథకం వర్తిస్తుందా?

యూఏఈ: యూఏఈలో వీసా క్షమాభిక్ష పథకం సెప్టెంబర్ 1న ప్రారంభమైనప్పటి నుండి వేలాది మంది అక్రమ ప్రవాసులు తమ హోదాను క్రమబద్ధీకరించుకున్నారు.  అయితే, సెప్టెంబరు 1 తర్వాత జరిగే ఉల్లంఘనలు, జరిమానాలను క్షమాభిక్ష కవర్ చేస్తుందా అనే విషయం గురించి నిపుణుల వివరణ ఇచ్చారు.  ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ & పోర్ట్ సెక్యూరిటీ (ICP) ప్రకారం.. సెప్టెంబరు 1 తర్వాత జరిగిన ఉల్లంఘనలు పథకం పరిధిలోకి రావని స్పష్టం చేశారు.  అర్హత కలిగిన క్షమాభిక్ష దరఖాస్తుదారులకు అడ్మినిస్ట్రేటివ్, ఎస్టాబ్లిష్మెంట్ కార్డ్, ID కార్డ్, వర్క్ కాంట్రాక్ట్ సంబంధిత జరిమానాల నుండి మినహాయింపు ఇచ్చారు. 

ICP ప్రకారం.. క్షమాభిక్ష సెప్టెంబరు 1 నుండి అక్టోబర్ 30 వరకు వర్తిస్తుంది. ఈ కాలంలో అక్రమ నివాసితులు తమ స్థితిని క్రమబద్ధీకరించకుంటే, అన్ని సంబంధిత జరిమానాలు వర్తించవు. ఎగ్జిట్ పాస్ వచ్చిన 14 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటుంది.   గడువు ముగిసిన లేదా చెల్లని రెసిడెన్సీ పర్మిట్‌లు ఉన్నవారు, వీసాల గడువు ముగిసిన వ్యక్తులు, అడ్మినిస్ట్రేటివ్ వర్క్ నిలిపివేత నివేదికలలో పేరు ఉన్నవారు, పుట్టిన నాలుగు నెలలలోపు రెసిడెన్సీ నమోదు చేసుకోని విదేశీయులకు ఈ పథకం వర్తిస్తుంది.  గ్రేస్ పీరియడ్‌లో తమ వీసా స్థితిని క్రమబధ్దికరించుకుంటే అలాంటి వారిపై రీ-ఎంట్రీ నిషేధాన్ని విధించారు. వారు చెల్లుబాటు వీసాతో ఎప్పుడైనా యూఏఈలోకి అడుగుపెట్టవచ్చని ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com