అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్.. కింగ్ మేకర్ ను భారత్‌కు అప్పగించిన యూఏఈ..!!
- September 12, 2024
యూఏఈ: అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్లో కీలక ఆపరేటర్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయుడిని యూఏఈ అధికారులు అరెస్ట్ చేశారు. ఇంటర్‌పోల్ రెడ్ నోటీసు జారీ చేయడంతో నిందితుడిని భారత ప్రభుత్వానికి అప్పగించినట్లు పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని సికార్‌లో నివాసముంటున్న మునియాద్ అలీఖాన్ భారత్ చేరుకోగానే భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుంది. సెప్టెంబరు 10న భారతదేశంలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఒక ప్రకటన విడుదల చేసింది. "CBI గ్లోబల్ ఆపరేషన్స్ సెంటర్ మునియాద్ అలీ ఖాన్ ను యూఏఈ అధికారులు అప్పగించారు. అతడి అరెస్టుకు ఇంటర్‌పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో అబుదాబితో NIA సమన్వయం చేసుకుంది. అంతర్జాతీయ గోల్డ్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లో అతను కీలక ఆపరేటర్." అని ప్రకటనలో పేర్కొన్నారు. మార్చి 2021లో ఖాన్ సహా మరో 17 మందిపై ఎన్ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మునియాద్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నప్పుడు సహ నిందితులైన సమీర్ ఖాన్, ఐజాజ్ ఖాన్, సురేంద్ర కుమార్ దర్జీ, మహ్మద్ ఆరిఫ్‌లతో కలిసి ముఠాగా ఏర్పడినట్టు ఈ కేసులో NIA దర్యాప్తు రిపోర్టులో వెల్లడించింది. ఈ ముఠా గల్ఫ్ దేశం నుండి ఇండియాకు బంగారు కడ్డీలు, బిస్కెట్లను అక్రమంగా రవాణా చేస్తుందని నివేదికలో తెలిపారు. జూలై 3, 2020న జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారతీయ కస్టమ్స్ అధికారులు 18.5 కిలోల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. స్పైస్‌జెట్ ఫ్లైట్ SG-9647లో రియాద్ నుండి వచ్చిన పది మంది వ్యక్తులను అరెస్టు చేశారు. ఈ బృందం వారి సహచరులతో కలిసి బంగారాన్ని ఎమర్జెన్సీ లైట్ల బ్యాటరీ కంపార్ట్మెంట్లలో దాచిపెట్టి, చెక్ఇన్ బ్యాగేజీలో ప్యాక్ చేసి భారత్‌లోకి అక్రమంగా బంగారాన్ని తరలించేందుకు కుట్ర పన్నిందని ఎన్ఐఏ పేర్కొంది.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







