అరుదైన సాంస్కృతిక సమ్మేళనం.. పోప్ ఫ్రాన్సిస్‌తో షేక్ మొహమ్మద్..!!
- September 15, 2024
యూఏఈ: యూఏఈ-కాథలిక్ చర్చి మధ్య ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ద్వైపాక్షిక సంబంధాలు మరితం బలోపేతం అయ్యాయి. శాంతి, భద్రత, స్థిరత్వం, సహనం, మానవతా విలువలను ప్రోత్సహించడానికి గుర్తుగా ఎనిమిదేళ్ల క్రితం పోప్ ఫ్రాన్సిస్‌ను షేక్ మొహమ్మద్ కలుసుకున్నప్పుడు అరుదైన సంఘటనగా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అప్పటి అబుదాబి క్రౌన్ ప్రిన్స్ యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ అయిన అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ 2016 సెప్టెంబర్ 15న వాటికన్‌లో పోప్ ఫ్రాన్సిస్‌ను కలుసుకున్నారు.
ఈ సందర్భంగా షేక్ మొహమ్మద్ పోప్ ఫ్రాన్సిస్‌కు సర్ బని యాస్ ద్వీపంలో పురావస్తు ఆవిష్కరణలతో కూడిన ఫోటో అల్బమ్ ను అందించారు. షేక్ పోప్‌కు కార్పెట్ ఆఫ్ పీస్‌ను బహుకరించారు. ఇది ఆఫ్ఘనిస్తాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు మద్దతుగా షేఖా ఫాతిమా బింట్ మొహమ్మద్ బిన్ జాయెద్ ప్రారంభించిన చొరవ ద్వారా ఉత్పత్తి చేసినది. "ప్రపంచం అంతటా శాంతి, స్థిరత్వాన్ని నెలకొల్పడానికి మేము కలిసి పని చేస్తున్నాము," అని షేక్ మొహమ్మద్ పేర్కొన్నారు. షేక్ మొహమ్మద్ వాటికన్ పర్యటన మానవాళికి ముఖ్యమైన సంస్కృతి, నాగరికత మార్పిడిని ప్రారంభించిందని దుబాయ్ గ్రాండ్ ముఫ్తీ అయిన డాక్టర్ అహ్మద్ అల్ హద్దాద్ అభిప్రాయపడ్డారు. షేక్ మొహమ్మద్ సందర్శన అనంతరం పోప్ ఫ్రాన్సిస్ 2019 ఫిబ్రవరిలో యూఏఈలో పర్యటించారు. అది ఒక క్యాథలిక్ చర్చి నాయకుడు అరేబియా ద్వీపకల్పానికి చేసిన మొదటి అపోస్టోలిక్ ప్రయాణంగా చరిత్రలో నిలిచిపోయింది. తన పర్యటనలో పోప్ ఫ్రాన్సిస్ 2019 ఫిబ్రవరి 4న అల్ అజర్ అహ్మద్ అల్-తయ్యబ్ గ్రాండ్ ఇమామ్‌తో కలిసి ‘ప్రపంచ శాంతి పత్రం’పై సంతకం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..