రుమైలా హాస్పిటల్.. అధునాతన స్పైనల్ డికంప్రెషన్ క్లినిక్‌ ప్రారంభం..!

- September 15, 2024 , by Maagulf
రుమైలా హాస్పిటల్.. అధునాతన స్పైనల్ డికంప్రెషన్ క్లినిక్‌ ప్రారంభం..!

దోహా: రుమైలా హాస్పిటల్‌లో క్రానిక్ నెక్,  బ్యాక్ పెయిన్ మేనేజ్‌మెంట్ కోసం తన కొత్త స్పైనల్ డికంప్రెషన్ క్లినిక్‌ను ఇటీవల ప్రారంభించినట్టు హమద్ మెడికల్ కార్పొరేషన్ ప్రకటించింది. అధునాతన సాంకేతికతలు, అత్యాధునిక పరికరాలను ఉపయోగించి ఫిజియోథెరపీ రోగులకు అవసరమైన చికిత్సను అందిస్తున్నట్టు తెలిపింది. స్పైనల్ డికంప్రెషన్ క్లినిక్ డాక్టర్ హనాది అల్ హమద్ మాట్లాడుతూ.. కొత్త క్లినిక్‌లో ప్రవేశపెట్టిన సాంకేతికతలు దీర్ఘకాలిక మెడ, తక్కువ వెన్నునొప్పి కోసం రికవరీ రేటును మెరుగుపరచడంలో సహాయపడతాయని ధృవీకరించారు. ఈ ప్రక్రియ నరాలు, వెన్నుపూసపై ఒత్తిడిని తగ్గిస్తుందన్నారు.  చికిత్స వ్యవధి సాధారణంగా 30-50 నిమిషాలు పడుతుందని, రోగుల పరిస్థితిని బట్టి రోగులకు సాధారణంగా 5 నుండి 7 వారాల పాటు అనేక సెషన్‌లు అవసరమవుతాయని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com