అల్ ఖుసైస్, జెబెల్ అలీ.. అందుబాటులోకి కొత్త బ్రిడ్జులు..!

- September 16, 2024 , by Maagulf
అల్ ఖుసైస్, జెబెల్ అలీ.. అందుబాటులోకి కొత్త బ్రిడ్జులు..!

దుబాయ్: రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA)  సెప్టెంబర్ 15న దుబాయ్‌లో రెండు కొత్త వంతెనలను ప్రారంభించింది. వీటిని గార్న్ అల్ సబ్ఖా-షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ ఇంటర్‌సెక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించారు. RTA డైరెక్టర్ జనరల్, బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఛైర్మన్ మత్తర్ అల్ టేయర్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ వాహనదారుల ప్రయాణ సమయాన్ని 70 శాతం వరకు తగ్గిస్తుందని తెలిపారు.   

మొదటి వంతెన 601 మీటర్లు విస్తరించి, రెండు లేన్‌లను కలిగి ఉంది. గంటకు 3,200 వాహనాల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది గార్న్ అల్ సబ్ఖా స్ట్రీట్ నుండి షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ వరకు తూర్పు వైపు ట్రాఫిక్‌ ఉత్తరాన అల్ ఖుసైస్, దీరా వైపునకు సులువుగా వెళ్లవచ్చు.  ఈ వంతెన ప్రయాణ సమయాన్ని 40 శాతం తగ్గిస్తుంది. పీక్-అవర్ ప్రయాణాన్ని 20 నిమిషాల నుండి కేవలం 12 నిమిషాలకు తగ్గిస్తుంది.  

రెండవ వంతెన 664 మీటర్లు.  రెండు లేన్లతో గంటకు 3,200 వాహన సామర్థ్యంతో నిర్మించారు. ఈ వంతెన షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్ నుండి దక్షిణాన అల్ యలాయిస్ స్ట్రీట్, జెబెల్ అలీ పోర్ట్ వైపు వచ్చే వాహనాల రద్దీని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ వంతెన వాహనదారుల ప్రయాణ సమయాన్ని 70 శాతం తగ్గిస్తుందని, దీని వల్ల ప్రయాణ సమయం 21 నిమిషాలకు బదులుగా 7 నిమిషాలుగా మారుతుందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ మూడవ చివరి వంతెన అక్టోబరులో ప్రారంభం కానుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com