దంతాలని మెరిపించే ఆహారం!

- June 19, 2016 , by Maagulf
దంతాలని మెరిపించే ఆహారం!

మనకు బరువు తగ్గించే ఆహారం గురించి తెలుసు. కానీ నవ్వించే ఆహారం గురించి విన్నారా? పళ్లని మిలమిలా మెరిపించే ఆహారం చక్కగా నవ్వించేదే కదా మరి..! అలాంటివే ఇవి..
స్ట్రాబెర్రీలు: దోరగా లేదా పండిన స్ట్రాబెర్రీల్లో మాలిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలని మెరిపిస్తుంది. వీటిలోని శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు పళ్లపై మరకలకి కారణమైన బ్యాక్టీరియాని అదుపు చేస్తాయి. చిగురు వాపు రాకుండా నివారిస్తాయి.
అనాస: దంతాలను సహజంగా శుభ్రపరిచి, దంతాలని మెరిపించే గుణం ఉన్న పండు అనాస. ఇందులోని బ్రొమిలైన్‌ సహజసిద్ధ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.
క్యారెట్‌:
క్యారెట్‌ని హల్వాగానో, జ్యూస్‌లా చేసుకోవడం కంటే చక్కగా శుభ్రం చేసి పచ్చిగా తినడం మంచిది. పళ్లపై ఇతర పదార్థాల కారణంగా పేరుకున్న బ్యాక్టీరియా, వ్యర్థాలని ఇది తొలగిస్తుంది. పళ్లకి తగిన వ్యాయామం అంది చిగుళ్లూ బలపడతాయి.
కాలీఫ్లవర్‌: చక్కని పోషకాలు నిండిన కాలీఫ్లవర్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచడంతోపాటూ దంతాలనీ చక్కగా మెరిపిస్తుంది. ఇందులో పీచు ఎక్కువ కాబట్టి తినేటప్పుడు నోట్లో లాలాజలం వూరుతుంది. దంతాల ఎనామిల్‌పై మరకలు పడకుండా చూస్తుంది.
పెరుగు: పెరుగూ, జున్నూ కూడా దంతాలని మెరిపిస్తాయి. క్యాల్షియం, మాంసకృత్తులు అధికంగా ఉండే పదార్థాలు కాబట్టి దంతాలపై ఉండే ఎనామిల్‌ను కాపాడుతుంటాయి. వీటిల్లోని లాక్టిక్‌ యాసిడ్‌ దంతాలకి తగిన రక్షణ ఇస్తుంది. పెరుగులోని పాస్ఫరస్‌ పళ్లపై ఆమ్లాలు పేరుకోకుండా చూసి రంగు మారకుండా కాపాడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com