విషాదం..వాహనం ఢీకొని 12 ఏళ్ల చిన్నారి మృతి

- September 17, 2024 , by Maagulf
విషాదం..వాహనం ఢీకొని 12 ఏళ్ల చిన్నారి మృతి

యూఏఈ: ఫుజైరాలోని అల్ ఫసీల్ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న 12 ఏళ్ల బాలుడు వాహనం ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ మేరకు ఫుజైరా పోలీసులు తెలిపారు. ఫుజైరాలోని అల్ ఫసీల్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ఎమిరాటీ బాలుడిని ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను ప్రమాద స్థలంలో అరెస్టు చేసి తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com