అల్లర్ల ఆరోపణలు: 8 మందికి ఊరట
- June 19, 2016
లేబర్ అకామడేషన్‌లో గ్రూపుగా ఏర్పడి, అల్లర్లకు పాల్పడేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మందికి కాస్త ఊరట లభించింది. 353,000 దిర్హామ్‌ల నష్టం ఈ అల్లర్లలో జరిగింది. ఇందులో ముగ్గురు బ్లాక్ స్మిత్స్, ముగ్గురు కార్పెంటర్లు, ఇద్దరు కార్మికులపై అభియోగాలు నమోదయ్యాయి. వందలాది మంది కార్మికుల్ని పోగు చేసి అల్లర్లకు ప్రయత్నించారన్నది వీరిపై ఉన్న అభియోగాల సారాంశం. అల్లర్లలో అనేక వాహనాలు ధ్వంసం కాగా, కార్మాలయం, మెషీనరీ, ఎలక్ట్రానిక్స్ ధ్వంసమయ్యాయి. జనవరిలో జరిగాయి ఈ అల్లర్లు. బాధిత కంపెనీ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ మాట్లాడుతూ, 23 నుంచి 34 ఏళ్ళ వయసున్న సుమారు 300 మంది కార్మికులు ఆందోళన బాట పట్టారనీ, ఆస్తుల్ని ధ్వసం చేశారని, అకామడేషన్‌లో లిక్కర్ని బ్యాన్ చేయాలని యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరు ఈ ఆందోళనలు చేశారని తెలిపారు. అయితే, విచారణ సందర్భంగా సరైన సాక్ష్యాధారాలు చూపకపోవడంతో, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది మందే ఈ అల్లర్లకు కారణమని నిర్ధారించలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. అయితే అపీల్ చేసుకోవడానికి 15 రోజుల సమయం ఇచ్చింది న్యాయస్థానం.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







