ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల దారుణం

- July 05, 2015 , by Maagulf
ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదుల దారుణం

ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాదులు తమ దారుణాలు చూపించే మరో వీడియోను విడుదల చేశారు. 25 మంది వరకు ప్రభుత్వ ఫోర్సెస్‌ను నిర్దాక్షిణ్యింగా చంపేశారు. సెంట్రల్ సిరియాలోని ప్రాచీన నగరం పాల్మిరాలో ఈ సంఘటన జరిగింది. పాల్మీరాలోని మిలిన్నా ఓల్డ్ ఓయాసిస్‌లో గల ప్రాచీన రోమన్ థియేటర్‌లో వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ శనివారం చెప్పింది. ప్రస్తుతం ఆ థియేటర్ ఐసిస్ మిలిటెంట్ చేతుల్లో ఉంది. మే నెల నుండి అది వారి చేతుల్లోనే ఉంది. వీడియోలో... సైనికులను మోకాళ్ల పైన కూర్చుండబెట్టారు. వారి ముఖాలకు మాస్కులు వేశారు. వారి పక్కన ఐసిస్ ఉగ్రవాదులు నిలుచున్నారు. వారి తలలకు తుపాకులు పెట్టారు. ఈ హత్యాకాండ మే 27వ తేదీన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com