పేజర్లు, వాకీ-టాకీలను నిషేధించిన ఖతార్ ఎయిర్‌వేస్..!!

- September 20, 2024 , by Maagulf
పేజర్లు, వాకీ-టాకీలను నిషేధించిన ఖతార్ ఎయిర్‌వేస్..!!

దోహా: బీరుట్‌లోని రఫిక్ హరిరి అంతర్జాతీయ విమానాశ్రయం (బీఈవై) నుంచి ప్రయాణించే ప్రయాణికుల కోసం పేజర్లు, వాకీ-టాకీలను తక్షణమే నిషేధిస్తున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. లెబనాన్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి వచ్చిన ఆదేశాలను అనుసరించి ఎయిర్‌లైన్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ ప్రకటన చేసింది. ఇటీవలి సైబర్ దాడులకు సంబంధించిన పేజర్లు, వాకీ-టాకీల పేలుళ్ల నేపథ్యంలో లెబనీస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అటువంటి పరికరాలను విమానంలో తీసుకెళ్లడంపై నిషేధాన్ని అమలు చేసినట్లు వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com