ఏపీ: నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్

- September 20, 2024 , by Maagulf
ఏపీ: నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్.. అందుబాటులోకి పోర్టల్

అమరావతి: ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది. ఉ.10.30-మ.12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో, మ.12-సా.6 వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్‌ చేసుకునేలా పోర్టల్‌ను రూపొందించారు. అయితే 24 గంటలూ బుకింగ్‌కు అవకాశం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు.నూతన ఇసుక పోర్టల్‌ ద్వారా ఇసుక సరఫరాపై వివిధ దశల్లో అనుక్షణం నిఘా ఉంటుందని చెప్పారు. అధికారులు మొదలుకొని రవాణాదారుల వరకు ఎవరూ తప్పులు చేయలేని విధంగా పోర్టల్‌ను రూపొందించినట్లు వివరించారు. ఉచిత ఇసుక విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్‌ఫ్రీ నంబరు 1800 599 4599కు లేదా ఈ-మెయిల్‌ [email protected] ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. https://www.mines.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లోని ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(APSMS) పోర్టల్‌లో తొలుత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత జనరల్ కన్‌జ్యూమర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. మెయిల్ ఐడీ, చిరునామా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఖరారవుతుంది. ఆ తర్వాత నిర్మాణ వివరాలు నమోదు చేయాలి. పేమెంట్ పూర్తిచేశాక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com