వరల్డ్ ఫుడ్ ఇండియా '24 సదస్సులో పాల్గొన్న కువైట్..!!
- September 21, 2024
కువైట్: భారత రాజధాని న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా 2024 (డబ్ల్యూఎఫ్ఐ) కాన్ఫరెన్స్ మూడవ ఎడిషన్ అధికారిక ప్రారంభోత్సవంలో ఇండియాలోని కువైట్ రాయబారి మెషల్ అల్-షెమాలి, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ పబ్లిక్ అథారిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో గురువారం ప్రారంభమైన ఈ సదస్సు ప్రపంచ స్థాయిలో ఆహార రంగంలో పెట్టుబడిదారులు, ఉత్పత్తిదారులు, తయారీదారులకు ఒక ముఖ్యమైన అవకాశం అని అల్-షెమాలి తెలిపారు. ఆహార మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే రంగాలలో కువైట్ -ఇండియా మధ్య సహకారం మెరుగుపరచడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని అందిస్తుందన్నారు. నాలుగు రోజులపాటు జరిగిన ప్రపంచ ఆహార సదస్సులో 90 దేశాలు, అంతర్జాతీయ సంస్థల మంత్రులు, అధికారులు, ఆహార భద్రత, తయారీ కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. WFI 2024ని భారతదేశంలోని ఆహార పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నిర్వహించాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్