ఇరాన్ బొగ్గు గనిలో భారీ పేలుడు
- September 22, 2024
ఇరాన్: ఇరాన్ లోని ఓ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించింది. శనివారం అర్ధరాత్రి ప్రాంతంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. దీంతో లోపల పనిచేస్తున్న కార్మికులలో 30 మంది చనిపోయారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలిసి హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు.. గాయపడ్డ కార్మికులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. బొగ్గు గని టన్నెల్ లో కార్మికులు పనిచేస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించిందని సమాచారం. మీథేన్ గ్యాస్ లీక్ కావడమే పేలుడుకు దారి తీసిందని గాయపడ్డ కార్మికులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో గనిలో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు.
మరికొంత మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారని అనుమానం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, లోపల చిక్కుకున్న కార్మికులను క్షేమంగా బయటకు తీసుకొస్తామని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన బొగ్గు గని ఇరాన్ రాజధానికి సుమారు 540 కిలోమీటర్ల దూరంలోని తబాస్ లో ఉంది. కాగా, ఇరాన్ లో గతంలోనూ బొగ్గు గని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2017లో ఓ బొగ్గు గనిలో జరిగిన పేలుడుకు 42 మంది కార్మికులు బలయ్యారు. 2013లో రెండు గనులలో జరిగిన ప్రమాదాలలో 11 మంది, 2009లో జరిగిన మరో ప్రమాదంలో 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్