గ్రీన్ రియాద్ ప్రోగ్రామ్.. ఘుధ్వానా ఉపనది పునరుద్ధరణ పూర్తి..!!
- September 22, 2024
రియాద్: 34 నెలల కృషితో వాడి హనీఫా ముఖ్యమైన ఉపనది ఘుధ్వానా పర్యావరణ పునరుద్ధరణ పూర్తయినట్లు గ్రీన్ రియాద్ ప్రోగ్రామ్ అధికారులు వెల్లడించారు. నైరుతి రియాద్‌లోని ధహ్రత్ అల్ బదియా, అల్-సువైదీ, అల్-జహ్రా ప్రాంతాలను కలుపుతూ 5.2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఒక అందమైన సహజ నదిని పునరుద్ధరించినట్టు తెలిపారు. 15,000కు పైగా చెట్లు, పొదలను నాటినట్టు వెల్లడించారు. స్థానిక కమ్యూనిటీల జీవితాలను, జీవనోపాధిని మెరుగుపరచడం, ఈ ప్రాంతంలో టూరిజాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. సుస్థిర పర్యావరణ పద్ధతులు ప్రాజెక్ట్‌కు మార్గనిర్దేశం చేశాయని, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌ను మెరుగుపరచడానికి ప్రాజెక్ట్‌లో 65వేల చదరపు మీటర్ల సీటింగ్ ప్రాంతాలు, 13 పిల్లల ఆట స్థలాలు, వివిధ క్రీడా సౌకర్యాలు, 700 కంటే ఎక్కువ పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్టు వివరించారు. 22 కిలోమీటర్ల షేడెడ్ వాకింగ్ ట్రాక్ అన్ని సీజన్లలో ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్