అంబరాన్ని అంటిన 'నాట్స్' ముగింపు వేడుకలు

- July 05, 2015 , by Maagulf
అంబరాన్ని అంటిన 'నాట్స్' ముగింపు వేడుకలు

ఉత్తర అమెరికా తెలుగు సంగం(నాట్స్‌) లాస్‌ఏంజిల్స్‌ వేదికగా నిర్వహించిన తెలుగు సంబరాలు ఘనంగా ముగిశాయి. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరై తెలుగు జాతికి నాట్స్‌ చేస్తున్న సేవలను కొనియాడారు. నందమూరి బాలకృష్ణ అమెరికాలోని తెలుగు జాతిని కలిపి ఉంచుతున్న నాట్స్‌ని అభినందించారు. నాట్స్‌కు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. జీఎంఆర్‌ అధినేత గ్రంధి మల్లికార్జునరావు, తనికెళ్ల భరణి,సిరాశ్రీ,భాస్కరభట్ల,గజల్ శ్రీనివాస్,గీత మాధురి తదితరులు పాల్గొన్నారు. 2017లో నాట్స్‌ తెలుగు సంబరాలను చికాగోలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com