అదిరేలా మటన్ దొన్నె బిర్యానీ..
- September 22, 2024
బిర్యానీలు అంటే చాలా మందికి ఇష్టం.ఆదివారం వచ్చిందంటే బిర్యానీ తినాలని అనుకుంటూ ఉంటారు. బిర్యానీల్లో ఎన్ని వెరైటీలు ఉన్నా ఇంకా ఇంకా స్పెషల్‌గా తినాలని అనుకుంటూ ఉంటారు. అందులోనూ ముస్లింలు చేసే బిర్యానీలు మరింత రుచిగా ఉంటాయి. ఎప్పుడూ హైదరాబాద్ బిర్యానీలే కాకుండా.. ఇలా వెరైటీగా మటన్ దొన్నె బిర్యానీ కూడా ట్రై చేయండి. చాలా మందికి దొన్నె బిర్యానీల గురించి తెలిసే ఉంటుంది. ఇంత రుచిగా ఉండే ఈ మటన్ దొన్నె బిర్యానీలను ఇంట్లో కూడా మనం తయారు చేసుకుని తినవచ్చు. మరి మటన్ దొన్నె బిర్యానీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మటన్ దొన్నె బిర్యానీకి కావాల్సిన పదార్థాలు:
మటన్, ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బియ్యం, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు, పసుపు, కారం, ఉప్పు, నెయ్యి, ఆయిల్.
మటన్ దొన్నె బిర్యానీ తయారీ విధానం:
ముందుగా మటన్‌ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టకోవాలి. ఇందులో కొద్దిగా కారం, ఉప్పు, కొద్దిగా పెరుగు, ఆయిల్, పసుపు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఇందులో కొద్దిగా నెయ్యి, ఆయిల్ వేసి అందులో ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అనాస పువ్వు, బిర్యానీ ఆకులు వేసి సువాసన వచ్చేంత వరకే ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి కలర్ మారేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు వీటిని చల్లార్చి.. వాటిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







