స్వచ్చమైన నెయ్యిని ప్రముఖ సంస్థల ద్వారానే కొనుగోలు చేస్తాం: TTD EO

- September 22, 2024 , by Maagulf
స్వచ్చమైన నెయ్యిని ప్రముఖ సంస్థల ద్వారానే కొనుగోలు చేస్తాం: TTD EO

తిరుమల: శ్రీవారి లడ్డు ప్రసాదంలో వినియోగించే ఆవు నెయ్యిలో కల్తీ వున్న అంశం భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు.

కల్తీ వస్తువులను అరికట్టడానికి టీటీడీ చర్యలు ప్రారంభించిందన్నారు. స్వచ్చమైన నెయ్యిని ప్రముఖ సంస్థలు ద్వారానే కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు. నందిని, అల్పా సంస్థల ద్వారానే నెయ్యిని కొనుగోలు చేస్తామన్నారు. వారు సరఫరా చేసే నెయ్యి నాణ్యతను పరిశీలించిన తరువాతే వాటి ద్వారా కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ఏబీయల్ ల్యాబ్ ద్వారా టెస్టింగ్ విధానాన్ని కొనసాగిస్తామన్నారు.

18 మందితో సెన్సరి ప్యానల్‌ను ఏర్పాటు చేశామని.. వారి ద్వారా నిరంతరాయంగా టెస్టింగ్ విధానాన్ని నిర్వహిస్తామన్నారు. 75 లక్షల రూపాయల వ్యయంతో ఎన్ఏబీయల్ తరహాలో ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎఫ్‌ఎస్ఎస్‌ఎల్‌ఏ వారి ఆధ్వర్యంలో కూడా ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. కల్తీ వస్తువుల వల్ల వచ్చిన దోషాలు ఆగష్టులో నిర్వహించిన పవిత్రోత్సవాల కారణంగా తొలగిపోయాయన్నారు. భక్తులు మనోభావాలు దృష్టిలో ఉంచుకొని రేపటి రోజున శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఆలయంలోని యాగశాలలో శాంతి యాగాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com