సీఎం రేవంత్ ఇంటికి మహేష్ బాబు..రూ.50 లక్షలు అందజేత
- September 23, 2024
హైదరాబాద్: వరద బాధితుల సహాయార్థం పలువురు ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సహాయనిధికి భారీగా విరాళాలు అందజేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చిరంజీవి, బాలకృష్ణ, విశ్వక్సేన్, సాయిధరమ్ తేజ్ సహా పలువురు నటులు సీఎం సహాయనిధికి వారి వంతు సహాయం అందించిన సంగతి తెలిసిందే.
తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సీఎం సహాయనిధికి విరాళాన్ని అందజేశారు. మహేష్ బాబు సోమవారం ఉదయం తన సతీమణి నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి అక్కడ సీఎంను కలిసి వరద బాధితుల సహాయార్థం విరాళాన్ని అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షల రూపాయల చెక్కును అందించారు. AMB తరపున మరో రూ. 10 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది.
--సాయికిరణ్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్